: కాంగ్రెస్, బీజేపీ నాయకులు భవిష్యత్ లో ఇక్కడ తిరగాలంటే.. ప్రజలకు క్షమాపణలు చెప్పాలి: పవన్


రాష్ట్రం విడిపోయిన తర్వాత సీమాంధ్రులు చాలా విసిగిపోయారని, ఇకనైనా కాంగ్రెస్, బీజేపీ నాయకులు మేల్కొని ప్రజలకు న్యాయం చేస్తారా? లేక ఇలాగే ఉంటారా? అనేది వారి చేతుల్లోనే ఉందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. రాష్ట్ర విభజన ద్వారా కాంగ్రెస్, బీజేపీ నాయకులు కోట్ల మంది ప్రజలకు క్షోభ కల్గించారని, ఆ పార్టీ నాయకులు భవిష్యత్ లో ఇక్కడ తిరగాలంటే కనుక, ఇక్కడికి వచ్చి క్షమాపణలు చెప్పాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. కోట్ల మంది ప్రజలకు క్షోభ కల్గించారని, ఆ క్షోభ వారికి మంచిది కాదని.. దయచేసి, ఈ విషయం తెలుసుకోవాలని అన్నారు. ‘నేను ఈ సభను ముగించబోయే ముందు ఒక్కటే ఒక్కటి అడుతుతున్నాను. మనం కూడా భారతీయులం. కార్గిల్ లో యుద్ధ సైనికులు చనిపోతే ఉత్తర భారతంలో ఎంత ఏడుస్తారో, మనం కూడా అంతే కన్నీళ్లు పెడతాము. భారత రాజ్యాంగాన్ని ఉత్తర భారతీయులెంత గౌరవిస్తారో, మనం కూడా అంతే గౌరవిస్తాం. భారతీయ చట్టసభలకు వారెంత గౌరవిస్తారో, మనం కూడా అంతే గౌరవిస్తాం. అందుకనీ, ఒక్కసారి, మన మాతృభూమికి జైహింద్ చెప్పి సెలవు తీసుకుందాం. భారత్ మాతాకీ జై. జైహింద్..జైహింద్..జైహింద్’ అని పవన్ తన ప్రసంగాన్ని ముగించారు.

  • Loading...

More Telugu News