: మా వల్ల కాదని అధికారపక్షం, ప్రతిపక్షం చెబితే అప్పుడు మేము రంగంలోకి దిగుతాం: పవన్


ఏపీకి ప్రత్యేక హోదా సాధించడం తమ వల్ల కాదని అధికారపక్షం, ప్రతిపక్షం కనుక ప్రజలకు చెబితే, అప్పుడు తాము రంగంలోకి దిగుతామని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ‘కేంద్రమంత్రి వెంకయ్య నాయుడుగారు ఒకటే మాట మాట్లాడతారు.. నాకు అర్థం కాదు. ఓట్లు అడగడానికి వచ్చినప్పుడేమో మనకందరికి అర్థమయ్యే భాష ‘ఏమన్నో, ఇంటికో బర్రె, పెంచడానికో గొర్రె, ఉండటానికో వాకిలి, దంచడానికో రోకలి. పిల్లాజెల్లా, గొడ్డు గోదా, రైతు గియితూ, అవ్వా అందరూ కూడా సుఖంగా, ఉత్సాహంగా ఉంటారు భారతీయ జనతాపార్టీ పాలనలో అంటారు. ఎక్కడండి, ఆ హ్యాపీ డేస్? మా కెక్కడా కనిపించడం లేదు. మాకు మా కన్నీళ్లు, ఏడుపులే ఉన్నాయి. ఓట్లు అడిగేటప్పుడేమో అర్థమయ్యే భాషలో మాట్లాడతారు. ఏదైనా ఇవ్వాల్సి వచ్చినప్పుడు అర్థంకాని భాషలో చెబుతారు. ఇస్తాము.. ఇవ్వం అని అర్థమయ్యేటట్లు ఎందుకు చెప్పరు? మీరు ఇవ్వమని చెబితే మేము ఏం చేయాలో అది చేస్తాము. అర్థం కాకుండా మాట్లాడి తప్పించుకుంటే, మేము కాళ్లు చేతులూ ముడుచుకుని కూర్చోలేదు. ఏం చెయ్యాలో అది చేసి చూపిస్తాము’ అని పవన్ కల్యాణ్ హెచ్చరించారు.

  • Loading...

More Telugu News