: పవన్ కల్యాణ్ పై విమర్శలు చెయ్యొద్దు: పార్టీ నేతలకు చంద్రబాబు ఆదేశం
తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ జేఎన్టీయూ గ్రౌండ్ లో జరిగిన సభలో జనసేన అధినేత, సినీనటుడు పవన్ కల్యాణ్ ప్రసంగం చేసిన దృష్ట్యా ఆయనపై విమర్శలు చెయ్యొద్దని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టీడీపీ నేతలను ఆదేశించారు. హైదరాబాద్‌లో అసెంబ్లీ కమిటీ హాలులో టీడీపీ శాసనసభాపక్షం భేటీ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పవన్ వాదనను మనం అర్థం చేసుకోవచ్చని పేర్కొన్నారు. క్లిష్ట పరిస్థితుల్లో ప్యాకేజీని తిరస్కరించలేమని అన్నారు. అయితే, ప్యాకేజీతో సరిపెట్టుకోబోమని, హోదా కోసం ప్రయత్నిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని ఎంతో జాగ్రత్తగా అభివృద్ధి చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.