: శ్రీలంక పైలట్ల వినూత్న నిరసన
బ్రీత్ అనలైజర్ పరీక్ష విధానంపై శ్రీలంక పైలట్లు వినూత్న నిరసనకు తెరతీశారు. వర్క్ టు రూల్ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు. దీనిపై శ్రీలంక ఎయిర్ లైన్స్ అధికార ప్రతినిధి రేణుకా సేనానాయకే మాట్లాడుతూ, తాము బ్రీత్ ఎనలైజర్ పరీక్షలకు వ్యతిరేకం కాదని అన్నారు. అయితే ఈ పరీక్షలు నిర్వహించే విధానానికే తాము వ్యతిరేకమని ఆమె తెలిపారు. బ్రీత్ అనలైజర్ పరీక్షలు సరైన విధానంలో జరపాలని ఆమె డిమాండ్ చేశారు. అంతవరకు జాబితాలో ఉన్న వరకే తాము విధులు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. అదనపు పని దినాలు, అదనపు పని గంటల్లో విధుల్లో పాల్గొనకుండా తమ నిరసన తెలుపుతామని ఆమె స్పష్టం చేశారు.