: నాకు రాజకీయ పిచ్చ కనుక ఉంటే సమైక్యాంధ్ర ఉద్యమాన్ని నేనే నడిపించేవాడిని: పవన్
‘నాకే రాజకీయ అధికార దాహం ఉంటే, రాజకీయ పిచ్చ ఉంటే కనుక సమైక్యాంధ్ర ఉద్యమాన్ని నేనే నడిపేవాడిని’ అని పవన్ కల్యాణ్ అన్నారు. ‘ఏం అంతమాత్రం దమ్ము లేదా, తెగింపు లేదా, అంతమాత్రం రాజకీయం చేయలేమా? ఎందుకు చేయలేదంటే, నాకు తెలంగాణ అంటే ప్రేమ, ఇష్టం. తెలంగాణ కష్టాలు చాలా దగ్గరగా చూశాను. ఒకసారి ప్రజారాజ్యం పార్టీ తరపున ఉస్మానియా యూనివర్శిటీకి వెళ్లాను. అక్కడున్న యువకుల సమూహం ‘రే, పవన్ కల్యాణ్. తెలంగాణ గురించి నీకేమి తెలుసు?’ అన్నారు. చాలా తిట్టారు. అప్పుడు నేనేమి చెప్పానంటే.. నా స్నేహితులు, సన్నిహితులు, తెలంగాణ కవి మాస్టార్జీ పాట ఒకటి పాడాను. ఆ పాటేమిటంటే ‘ఊరి దొరలకు ఉంపుడు గత్తెలు... ’ (అంటూ పవన్ ఆ పాట పాడారు). భారతదేశంలో ఏమూల కష్టాలొచ్చినా బాధపడే వ్యక్తిని నేను అని చెప్పాను. ప్రజల సమస్యలు అర్థం చేసుకుని పోరాటం చేసేందుకే నేను రాజకీయాల్లోకి వచ్చానుకానీ, పదవులు అనుభవించడానికి కాదు’ అని పవన్ అన్నారు.