: దీపికా పదుకునే ఒప్పుకుంటే ఆమెతో సినిమాలో నటిస్తా: డ్వెన్ బ్రావో


బాలీవుడ్ ప్రముఖ నటి దీపికా పదుకునేపై వెస్టిండీస్ క్రికెటర్లు మనసు పారేసుకుంటున్నట్టు కనిపిస్తోంది. మూడు రోజుల క్రితం చెన్నై వచ్చిన క్రిస్ గేల్ తాను దీపికా పదుకునే ఆటోగ్రాఫ్ తీసుకుంటానని చెప్పగా, తాజాగా డ్వెన్ బ్రావో ఆమె అంగీకరిస్తే, ఆమెతో కలిసి సినిమా చేసేందుకు రెడీగా ఉన్నానని చెప్పాడు. 'తుమ్ బిన్-2' సినిమాలో పాట పాడేందుకు ముంబై వచ్చిన బ్రావో, అక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నాడు. అనంతరం ఆయన మాట్లాడుతూ, దీపికా పదుకునేకు తాను వీరాభిమానినని అన్నాడు. స్టేజ్ పై ఆమెను చూసి హాయ్, బాయ్ చెప్పడానికే సరిపోయిందని, ఆమెతో మాట్లాడడం కుదర్లేదని వాపోయాడు. ఎప్పట్నుంచో దీపికా పదుకునేతో ఒక పాటలో నటించాలని ఉందని తెలిపాడు. ఆమె సరేనంటే ఆమెతో సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నానని ఆఫర్ ఇచ్చాడు.

  • Loading...

More Telugu News