: పవన్ కల్యాణ్ పై కండువాలు విసిరిన అభిమానులు


కాకినాడ‌లోని జేఎన్టీయూ గ్రౌండ్ లో జనసేన అధినేత‌, సినీనటుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ నిర్వహిస్తోన్న సభలో పవన్‌ మాట్లాడుతున్న సమయంలో ఆయనపై అభిమానులు ఎర్ర‌ని కండువాలు విసిరారు. మొద‌ట ఓ అభిమాని విసిరిన కండువా వేదిక‌పై ప‌డ‌డంతో ప‌వ‌న్ క‌ల్యాణ్ దాన్ని గ‌మ‌నించి, కండువాను తీసుకొని బుజంపై వేసుకున్నారు. దాన్ని గ‌మ‌నించిన అభిమానులు అంద‌రూ రెచ్చిపోయి వారి వ‌ద్ద ఉన్న ఎర్ర‌ కండువాల‌న్నింటినీ ప‌వ‌న్ వైపు విసిరారు. దీంతో వేదిక‌పై ప‌దుల సంఖ్య‌లో కండువాలు వ‌చ్చిప‌డ్డాయి. ప‌వ‌న్ మ‌రో కండువా తీసుకొని చెమ‌ట తుడుచుకున్నారు. వేదిక‌పై కండువాల వ‌ర్షం కురుస్తుండ‌డంతో స్పందించిన భ‌ద్ర‌తా సిబ్బంది కండువాలు విస‌రొద్ద‌ని సూచించారు. ప‌వ‌న్‌కి అడ్డంగా నిల‌బ‌డే ప్ర‌య‌త్నం చేశారు. దీంతో అభిమానులు కండువాలు విస‌ర‌డం ఆపేశారు.

  • Loading...

More Telugu News