: ఆ ప్రకటన కోసమే మొన్న రాత్రి 10 గంటల వరకు మేల్కొని ఉన్నా: వైఎస్ జగన్
ఏపీకి సాయం విషయమై కేంద్రం చేసే ప్రకటన కోసం మొన్న రాత్రి పది గంటల వరకు మేల్కొనే ఉన్నానని వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, అర్ధరాత్రి ప్యాకేజ్ ఇవ్వడంలోనే మోసం ఉందని, మొన్న అర్ధరాత్రి ఢిల్లీలో హైడ్రామా నడిచిందని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయమై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని, చంద్రబాబు ఆమోదం తర్వాతే జైట్లీ ప్యాకేజ్ ప్రకటించారని ఆరోపించారు.