: జైట్లీజీ! ఆప్ బహూత్ అచ్ఛా ప్యాకేజీ దియాహై!: ధన్యవాదాలు తెలిపిన హరిబాబు
కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అద్భుతమైన ప్యాకేజీ ఇచ్చారని ఏపీ బీజేపీ నేతలు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. ఢిల్లీలో అరుణ్ జైట్లీతో ఏపీ బీజేపీ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు, ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, పలువురు ఆ పార్టీ నేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన జైట్లీకి ధన్యవాదాలు తెలిపి, ఆయనను శాలువతో సత్కరించారు. ఆయన ప్రకటించిన ప్యాకేజీ ఏపీ సమగ్ర అభివృద్ధికి దోహదపడుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.