: అరే... మూడేళ్లుగా పాచిపోయిన లడ్డూలు ఎవరికి కావాలి? గోటితో పోయేదాన్ని గొడ్డలి వరకూ తెచ్చారు: పవన్ కల్యాణ్


మూడు సంవత్సరాలుగా ప్రత్యేక హోదా కోసం వేచి చూస్తున్న ఆంధ్ర ప్రజల చేతుల్లో కేంద్రం లడ్డూలు పెట్టిందని ఆరోపించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ కాకినాడ వేదికగా పదునైన మాటలతో, కేంద్ర వైఖరిపై తన తీవ్ర నిరసనను తెలియజేస్తున్నారు. "అరే.. ఒక మూడు సంవత్సరాలుగా పాచిపోయిన లడ్డూలు ఎవడికి కావాలి? మీ లడ్డూల కంటే మా బందరు లడ్డూలు బాగుంటాయి కదా? మా కాకినాడ తాపేశ్వరం కాజాలు ఇంకా బాగుంటాయి కదా? కావాలంటే చెప్పండి ఇస్తాం. అవకాశవాదపు రాజకీయాల వల్ల గోటితో పోయేదాన్ని గొడ్డలి వరకూ తెచ్చారు. ఎవరూ..? ఒక్కరు కాదు, చాలా మంది కలిపి నాలుగు దశాబ్దాలకు పైగా మోసం చేసి చేసి చేసీ... ఈ రోజున మనమున్న ఈ పరిస్థితికి తీసుకువచ్చారు. అందుకే, మన హక్కుల కోసం పోరాటం చేయడానికి మనం కాకినాడకు వచ్చాం. అసలు బీజేపీ నాయకులకు ఎంత ధైర్యం? అరే, సీమాంధ్రకు వచ్చి, ఆంధ్రప్రదేశ్ కు వచ్చి విడగొడతారా? అంత ధైర్యమా మీకు? ఏం మాకు పౌరుషం చచ్చిపోయిందా? పోరాట పటిమ తగ్గిందనుకుంటున్నారా?" అంటూ తన ఆగ్రహాన్ని ప్రదర్శించారు. పవన్ కల్యాణ్ ప్రసంగం కొనసాగుతోంది.

  • Loading...

More Telugu News