: 'వెంకయ్యనాయుడూ జీ...' అంటూ నిప్పులు చెరుగుతూ ప్రారంభమైన పవన్ ప్రసంగం!
అందరూ ముందుగా ఊహించినట్టుగానే పవన్ కల్యాణ్ ప్రసంగం, ప్రత్యేక హోదాను ఇవ్వడం లేదని స్పష్టం చేసిన బీజేపీ వైఖరిపై నిప్పులు చెరుగుతూనే ప్రారంభమైంది. తొలుత అభిమానులతో "భారత్ మాతాకీ జై" అని దిక్కులు పిక్కటిల్లేలా నినాదాలు చేయించిన ఆయన, తన పదునైన వాగ్బాణాలను తొలుత వెంకయ్యపై ఎక్కుపెట్టారు. "మాననీయ వెంకయ్యనాయుడూ జీ... ఆప్ ఔర్ ఆప్ కీ బీజేపీ పార్టీ నే మిలికే దోనో హాతోంమే లడ్డూ... మోతీ చూర్ కా లడ్డూ దియా" (వెంకయ్యనాయుడు గారూ... మీరూ, మీ బీజేపీ పార్టీ కలసి మా రెండు చేతుల్లో బూందీ లడ్డూ పెట్టారు) అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. మూడేళ్ల నుంచి స్పెషల్ స్టేటస్ ఇస్తాం ఇస్తాం అంటూ తీపికబురు వస్తుందని ఆశగా చూస్తుంటే రెండు లడ్డూలు ఇచ్చారు. ఏం నాయనా లడ్డూ తింటారా? లడ్డూ తింటారా? అంటున్నారు" అంటూ పవన్ వ్యంగ్యంగా అన్నారు.