: తెలంగాణ ఏసీబీ కదిలింది, బాబు హోదా డ్రామా మొదలైంది: వైఎస్ జగన్
ఓటుకు నోటు కేసులో చంద్రబాబు అడ్డంగా చిక్కుకుని పీకల్లోతున ఇరుక్కుని ఉండటంతోనే కేంద్రం హోదా ఇవ్వబోనని అంత నిర్దయగా చెబుతున్నా, దాన్ని స్వాగతిస్తున్నట్టే మాట్లాడుతున్నారని వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. ఈ హోదా డ్రామా తెలంగాణ ఏసీబీ కోర్టు, ఈ కేసులో బాబు పాత్రపై విచారించమని ఆదేశాలు ఇచ్చిన నాటి నుంచి మొదలైందని ఆరోపించారు. ఈ కేసులో 'విచారణ స్టార్ట్' అనగానే చంద్రబాబు వెంటనే కేంద్రంతో బేరసారాలు మొదలు పెట్టారని అన్నారు. కేంద్రం నుంచి వెళ్లిపో అన్నా కూడా చంద్రబాబు వెళ్లిపోయే పరిస్థితుల్లో లేరని, వాళ్ల కాళ్లు పట్టుకుని అయినా కేంద్రంతో కొనసాగాలని, వాళ్లు ఏమీ చేయకపోయినా కొనసాగాలన్నదే చంద్రబాబు అభిమతమని ఎద్దేవా చేశారు. దీనికి కారణం ఆయనకు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు నల్లధనం కావాలని, అందుకు కాంట్రాక్టులు ఇచ్చి కమిషన్లు తీసుకోవాలని, అందుకు డబ్బు కావాలని, ఆ అవసరాల కోసమే ప్యాకేజీలను ఆయన సమర్థిస్తూ, 5 కోట్ల మంది ప్రజలను వెన్నుపోటు పొడిచారని తీవ్ర విమర్శలు చేశారు.