: 'హోదా ఇవ్వడం లేదు' అంటుంటే దానిని స్వాగతించడానికి ఈయనెవడండీ: చంద్రబాబుపై జగన్ విసుర్లు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం లేదు అని కేంద్రం కేటగారికల్ గా చెబుతుంటే, దాన్ని స్వాగతిస్తున్నానని చంద్రబాబు చెబుతున్నారని వైకాపా అధినేత వైఎస్ జగన్ నిప్పులు చెరిగారు. హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన ఆయన, "రాష్ట్ర యువత భవిష్యత్తు పాడైపోయేలా పరిస్థితి ఉంటే, తన మంత్రులను కేంద్రం నుంచి బయటకు రప్పించి, ఒత్తిడి పెంచి హోదాను సాధించాల్సిన స్థాయిలో ఉన్న చంద్రబాబు, కేంద్రం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని చెప్పడానికి ఈయనెవడండీ?" అంటూ విమర్శించారు. సమస్యల సుడిగుండంలో ఉన్న రాష్ట్రాన్ని మరింతగా నాశనం చేసేందుకు ఆయన కంకణం కట్టుకున్నట్టుందని ఎద్దేవా చేశారు. ఎందుకు కేంద్రాన్ని చంద్రబాబు ప్రశ్నించడం లేదని, ఎందుకు నిలదీయడం లేదని జగన్ అడిగారు.