: పాక్ జట్టు వన్డేల్లో విఫలమవ్వడానికి కారణం అదే: వసీం అక్రమ్


ఎప్పుడెలా ఆడుతుందో తెలియని జట్టుగా గుర్తింపు పొందిన పాక్ జట్టు తన పేరు ప్రతిష్ఠలను నిలబెట్టుకుంటోంది. ఇంగ్లండ్ తో జరిగిన సిరీస్ టెస్టుల్లో అత్యుత్తమ ఆటతీరుతో ఆకట్టుకున్న పాక్ జట్టు ర్యాంకింగ్స్ లో అగ్రస్థానానికి ఎగబాకిన సంగతి తెలిసిందే. మరోపక్క, పేలవ ప్రదర్శనతో వన్డేల్లో ఓటమిపాలైన పాక్ జట్టు ర్యాంకింగ్స్ లో పూర్తిగా దిగజారిపోయింది. దీంతో వన్డే వరల్డ్ కప్ కు ఆ జట్టు అర్హత సాధిస్తుందా? అన్న అనుమానం అందర్లోనూ నెలకొంది. ఈ నేపథ్యంలో జట్టు తీరుపై వెటరన్ క్రికెటర్ వసీం అక్రమ్ మాట్లాడుతూ, పాకిస్థాన్ టెస్టు జట్టులో సీనియర్ క్రికెటర్లున్నారని, వారి అనుభవంతో జట్టును విజయాల బాటపట్టిస్తున్నారని అన్నారు. వన్డేలకు వచ్చేసరికి సీనియర్లలో చాలా మంది అందుబాటులో లేకపోవడంతో జట్టు చతికిలబడుతోందని అన్నారు. మిస్బావుల్ హక్, షాహిద్ అఫ్రిదీ, సయీద్ అజ్మల్ వంటి క్రికెటర్లు వన్డేల్లో అందుబాటులో లేకపోవడంతో పాక్ జట్టు ర్యాంకింగ్స్ లో దిగజారిందని ఆయన అభిప్రాయపడ్డారు. మిస్బా, అఫ్రిది గత వరల్డ్ కప్ వైఫల్యం తరువాత వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించగా, పలువురు సీనియర్లపై పీసీబీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. దీంతో జట్టు పేలవ ప్రదర్శన చేస్తోందని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News