: గొప్ప హంతకులవ్వాలన్న పిచ్చి కోరికతో దారుణానికి ఒడిగట్టిన అన్నదమ్ములకు యావజ్జీవ శిక్ష!
గొప్ప హంతకులుగా పేరు తెచ్చుకోవాలన్న ఒక పిచ్చి కోరికతో ఆ ఇద్దరు అన్నదమ్ములు తమ కుటుంబసభ్యులనే దారుణంగా హత్య చేశారు. దాంతో ఇప్పుడు వీరు యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్నారు. ఆ వివరాల్లోకి వెళితే, అమెరికాలోని ఒక్లహామా రాష్ట్రానికి చెందిన బేవర్స్ సోదరులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ఒక్లహామాలోని టల్సా పట్టణానికి చెందిన డేవిడ్ బేవర్, ఏప్రిల్ బేవర్ భార్యాభర్తలు. వారికి ఐదుగురు సంతానం. వారిలో రాబర్ట్ బేవర్ (19), మైఖేల్ బేవర్ (17) మిగతా వారి కంటే పెద్దవాళ్లు. వీరికి గొప్ప హంతకులుగా పేరు సంపాదించాలన్న పిచ్చి కోరిక వీరికి కల్గింది. ఏం చేస్తే తాము ఫేమస్ కిల్లర్స్ అవుతామా అని ఆలోచించి, చివరకు తమ కుటుంబ సభ్యులనే పొట్టనపెట్టుకున్నారు. గత ఏడాది జులైలో తమ తల్లిదండ్రులతో పాటు ఇద్దరు సోదరులు, సోదరిపై బ్లేడు, గొడ్డలితో దాడి చేసి దారుణంగా హతమార్చారు. ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ఆ ఇద్దరుసోదరులు ఈ హత్యలు చేశారు. నిందితులిద్దరూ దోషులని తేలడంతో వీరికి యావజ్జీవ కారాగారాశిక్ష విధిస్తూ గత ఏడాదిలో స్థానిక డిస్ట్రిక్ట్ కోర్టు తీర్పు నిచ్చింది. రాబర్ట్ ఇప్పటికే జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. వచ్చే ఏడాది నుంచి మైఖేల్ జైలు జీవితం గడపనున్నట్లు తాజా విచారణ అనంతరం కోర్టు తీర్పు నిచ్చింది.