: 'అప్నా బాంబే టాకీస్' పాటపై అభిమానుల రుసరుసలు!


భారతీయ సినిమా వందేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా హిందీలో తెరకెక్కిన చిత్రం 'బాంబే టాకీస్'. నాలుగు లఘు చిత్రాల మాలగా నలుగురు దర్శకులు రూపొందించిన ఈ చిత్రంలో 'అప్నా బాంబే టాకీస్' పేరుతో ఓ ప్రత్యేక పాటను రూపొందించారు. బాలీవుడ్ కు చెందిన 20 మంది ప్రముఖ నటీనటులు ఇందులో కనిపించారు. మూడు రోజుల కిందటే పాటను విడుదల చేశారు. ప్రేక్షకుల నుంచి మాత్రం అంతగా ఆదరణ పొందలేకపోయింది! 'అప్నా బాంబే' పాటలో నటులు అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర కుటుంబానికి చెందిన హీరోలు, సల్మాన్ ఖాన్ కనిపించకపోవడం గమనార్హం. దీనిపై నెట్ లో పలువురు అభిమానులు ప్రశ్నల వర్షం కురిపించారు.

కాలమిస్ట్ శోభాడే స్పందిస్తూ.. 'అంతమంది బాలీవుడ్ నటులు కనిపించిన 'అప్నా బాంబే టాకీస్' పాటలో సల్మాన్ తో చిన్న సన్నివేశం లేకపోవడం ఏమిటని ప్రశ్నించారు. దీనిపైనే ఓ అభిమాని మండిపడుతూ.. రెండు సినిమాల్లో నటించిన నటుడు రణ్ వీర్ సింగ్ ను ఎందుకు తీసుకున్నారు? అని అడిగాడు. బాలీవుడ్ కు అత్యంత ప్రాధాన్యత కల్పించి, ఖ్యాతిని దశదిశలా వ్యాపింపజేసిన అమితాబ్, హేమామాలిని, రేఖా, ధర్మేంద్రలు లేకపోవడం ఏమిటని ప్రశ్నించాడు. కాగా, ఫ్లాప్ సినిమాల్లో నటించిన సోనమ్ కపూర్ వంటి నటులు ఉన్న ఈ పాటలో అంతకంటే మెరుగైన నటుడు ఇమ్రాన్ ఖాన్ లేకపోవడం నిరాశను కలిగిస్తుందని మరో అభిమాని రాశాడు. కేవలం బాలీవుడ్ రాజవంశాలపైనే దృష్టిపెడితే.. అప్పుడు తప్పనిసరిగా సన్ని, బాబీ డియోల్స్ ఉండాలని, హేమామాలిని, ధర్మేంద్రలను కూడా చూపించాల్సిందని అలాగే బచ్చన్స్ కుంటుబం కూడా చాలా అవసరమన్నారు. కానీ,వారిని అలా నిర్లక్ష్యం చేయడం సరైంది కాదన్నారు. ఇదే పాటలో బాలీవుడ్ లెజెండ్ దిలీప్ కుమార్, జితేంద్ర, హృతిక్ రోషన్, అజయ్ దేవగణ్, కాజోల్ వంటి నటులు ఉండకపోవడం గమనించదగిన విషయం.

  • Loading...

More Telugu News