: రూ. 5 లక్షలు లంచమివ్వాల్సి వచ్చింది.. 'అచ్చే దిన్' ఇవేనా?: మోదీపై కోపం ప్రదర్శించిన కమెడియన్ కపిల్ శర్మ.. స్పందించిన ఫడ్నవీస్


"నేను గత 5 సంవత్సరాల కాలంలో రూ. 15 కోట్లను ప్రభుత్వానికి పన్నుగా చెల్లించాను. కానీ, నా ఆఫీసును పెట్టుకునేందుకు బీఎంసీ అధికారులకు రూ. 5 లక్షలు లంచమివ్వాల్సి వచ్చింది. ఇవేనా మీ 'అచ్చే దిన్' (మంచి రోజులు)" అంటూ కమేడియన్ కపిల్ శర్మ ఈ ఉదయం ప్రధాని మోదీని ఉద్దేశించి కోపంగా ప్రశ్నించాడు. ఉదయం 6 గంటల సమయంలో కపిల్ శర్మ వేసిన ఈ ప్రశ్న, మరో ఆరుగంటల్లో 7 వేలకు పైగా రీట్వీట్లు, షేర్ లనూ తెచ్చుకుని వైరల్ అయింది. కపిల్ ఫిర్యాదుకు మోదీ స్పందించలేదు గానీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. తనకు విషయం తెలిసిందని, విచారణ జరిపించి తగు చర్యలు తీసుకుంటానని ఆయన తెలిపారు. "కపిల్ భాయ్, నాకు విషయమంతా చెప్పు. ఇప్పటికే ముంబై మునిసిపల్ అధికారులపై కఠిన చర్యలకు ఆదేశించాను. లంచగొండులను క్షమించబోను" అని ఆయన ట్వీట్ చేశారు.

  • Loading...

More Telugu News