: లోకేష్ కోసం రాజీనామా చేస్తా: ఎమ్మెల్యే గొట్టిపాటి


తెలుగుదేశం యువనేత నారా లోకేష్ ను ఎమ్మెల్యేగా చూసేందుకు తాను రాజీనామా చేస్తానని అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవి ప్రకటించారు. కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడిన ఆయన, లోకేష్ ను మంత్రివర్గంలోకి తీసుకోవాలంటే ఎమ్మెల్సీగా కన్నా ఎమ్మెల్యేగా ఎన్నికై వస్తేనే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. లోకేష్ అద్దంకి నుంచి పోటీ చేస్తానంటే, తన సీటును త్యాగం చేసి ఆయన్ను భారీ మెజారిటీతో గెలిపించుకుంటానని అన్నారు. లోకేష్ వస్తే, అద్దంకితో పాటు ప్రకాశం జిల్లా అంతా అభివృద్ధి పథంలో దూసుకెళుతుందని గొట్టిపాటి అన్నారు.

  • Loading...

More Telugu News