: 'పవన్... పవన్' అంటూ మారుమోగుతున్న కాకినాడ!


తూర్పు గోదావరి జిల్లా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నామస్మరణ చేస్తోంది. నేటి సాయంత్రం పవన్ కల్యాణ్ కాకినాడ జేఎన్టీయూ కళాశాల మైదానంలో బహిరంగ సభలో ప్రసంగించనుండగా, దారులన్నీ సభా ప్రాంగణం వైపే సాగుతున్నాయి. ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తి కాగా, సభకు మరో మూడు గంటల సమయం ఉండగానే, దాదాపు 30 వేల మంది పవన్ అభిమానులు వేదిక వద్దకు వచ్చేశారు. వారంతా 'పవర్ స్టార్', 'జనసేన' అంటూ నినాదాలు చేస్తూ, పవన్ పాటలకు నృత్యాలు చేస్తున్నారు. ఈ సభలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ చోటు చేసుకోకుండా పోలీసులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. సభా ప్రాంగణం చుట్టుపక్కలా ట్రాఫిక్ ఆంక్షలు పెట్టారు. మైదానంలోకి వస్తున్న ప్రతి ఒక్కరినీ మెటల్ డిటెక్టర్లతో సోదాలు జరిపిన తరువాతనే అనుమతిస్తున్నారు. కాకినాడ వీధులన్నీ పవన్ పోస్టర్లతో నిండిపోయాయి. ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, గుంటూరు, విజయనగరం, విశాఖపట్నం తదితర జిల్లాల నుంచి భారీ ఎత్తున పవన్ అభిమానులు ప్రత్యేక వాహనాల్లో ఈ సభకు తరలి వస్తుండటం కనిపిస్తోంది.

  • Loading...

More Telugu News