: ప్రివిలేజ్ కమిటీ ఎమర్జెన్సీ మీటింగ్... వైకాపా సభ్యులపై కఠిన చర్యలకే!
ఈ ఉదయం నుంచి వైకాపా సభ్యులు అసెంబ్లీలో ప్రవర్తించిన తీరుపై చర్చించేందుకు ఏపీ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ అత్యవసరంగా సమావేశమైంది. పోడియంలోకి రావడంతో పాటు స్పీకర్ కుర్చీని ఆక్రమించాలని చూడటం, మార్షల్స్ తో గొడవలు, స్పీకర్ మైక్ ను విరగ్గొట్టడం, కెమెరాలు తోసివేయడం వంటి ఘటనలను తీవ్రంగా పరిగణిస్తున్న గొల్లపల్లి సూర్యారావు నేతృత్వంలోని ప్రివిలేజ్ కమిటీ సభ్యులు కఠిన చర్యలకు సిఫార్సు చేయనున్నట్టు తెలుస్తోంది. వైకాపా సభ్యుల వైఖరిని గర్హించిన సభ్యులు ఈ తరహా ఘటనలు మరోసారి జరుగకుండా చేపట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.