: స్పీకర్ కోడెల మైక్ విరగ్గొట్టిన ఆళ్ల, మార్షల్స్ ను నెట్టేసిన గోపిరెడ్డి... దృశ్యాలన్నీ ప్రజలకు లైవ్


ఈ ఉదయం ఏపీ అసెంబ్లీలో వైకాపా నిరసనలు తీవ్ర స్థాయికి చేరగా, స్పీకర్ పోడియంను చుట్టుముట్టిన ఎమ్మెల్యేలు కెమెరాలను పడదోసి, స్పీకర్ మైక్ ను విరిచేసి, మార్షల్స్ ను నెట్టేశారు. వాస్తవానికి అసెంబ్లీలో నిరసన దృశ్యాలను ప్రత్యక్ష ప్రసారం చేయకుండా నిబంధన ఉన్నప్పటికీ, ఈ దృశ్యాలన్నీ లైవ్ అవుతున్నాయి. స్పీకర్ కుర్చీ దగ్గరకు వెళ్లేందుకు తీవ్రంగా యత్నించిన వైకాపా ఎమ్మెల్యేలను మార్షల్స్ సైతం గట్టిగానే అడ్డుకున్నారు. ఈ క్రమంలో నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మార్షల్స్ ను పక్కకు లాగే ప్రయత్నం చేశారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏకంగా స్పీకర్ ముందున్న మైక్ ను అందుకుని దాన్ని లాగి పారేశారు. ఆ తరువాత రైల్వే కోడూరు ఎమ్మెల్యే శ్రీనివాస్, ఆళ్ల బెంచీలపైకెక్కి నినాదాలు చేశారు. ఈ దృశ్యాలన్నింటినీ తెలుగు టీవీ చానళ్లు పదే పదే చూపిస్తున్నాయి.

  • Loading...

More Telugu News