: నేటి నుంచి ఐఫోన్ల ప్రీ ఆర్డర్... లభించే దేశాల వివరాలు


ప్రపంచవ్యాప్తంగా 25 దేశాల్లో యాపిల్ ఐఫోన్ 7, 7 ప్లస్ ప్రీ ఆర్డర్ బుకింగ్స్ నేటి నుంచి ప్రారంభమయ్యాయి. ముందుగా బుక్ చేసుకున్న వారికి 16 నుంచి ఫోన్లను డెలివరీ చేస్తామని యాపిల్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇండియాలో మాత్రం ఈ ఫోన్ వర్షన్లు అక్టోబర్ 7 నుంచి అందుబాటులోకి రానున్నాయి. ఈ ఫోన్ల ప్రీ బుకింగ్స్ అందుబాటులోకి వచ్చిన దేశాల వివరాలివి... ఆస్ట్రేలియా, ఆస్ట్రియా, బెల్జియం, కెనడా, చైనా, డెన్మార్క్, ఫిన్ ల్యాండ్, ఫ్రాన్స్, జర్మనీ, హాంగ్ కాంగ్, ఐర్లాండ్, ఇటలీ, జపాన్, లక్సెంబర్గ్, మెక్సికో, నెదర్లాండ్స్, న్యూజిలాండ్, నార్వే, పోర్చుగల్, ప్యూర్టో రికో, సింగపూర్, స్పెయిన్, స్వీడన్, స్విట్జర్లాండ్, తైవాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బ్రిటన్, యూఎస్ వర్జిన్ ఐలాండ్స్, యూఎస్ దేశాల్లో ఫోన్ల బుకింగ్స్ ప్రారంభమయ్యాయి.

  • Loading...

More Telugu News