: వైకాపా ఎమ్మెల్యేలతో జగన్ అత్యవసర భేటీ
ఈ ఉదయం అసెంబ్లీలో జరిగిన పరిణామాలపై వైకాపా అధినేత వైఎస్ జగన్, తన ఎమ్మెల్యేలతో అత్యవసర భేటీ నిర్వహించారు. రాష్ట్రానికి ఎంతో ముఖ్యమైన ప్రత్యేక హోదాను చర్చకు రానీయకుండా, ప్రభుత్వం సమయం వృథా చేసే ఆలోచనలో ఉందని, హోదాకు అంతకుమించిన సమస్య రాష్ట్రానికి ఏముందని ఈ భేటీలో వ్యాఖ్యానించిన జగన్, చంద్రబాబు తన రాజకీయ ప్రలోభాల కోసమే ప్యాకేజీపై ప్రేమను చూపుతున్నారని ఆరోపించినట్టు తెలిసింది. తదుపరి అసెంబ్లీలో పాటించాల్సిన వ్యూహంపై వీరి మధ్య చర్చ జరుగగా, తక్షణం హోదాపై చర్చించాలని పట్టబడదామని అత్యధిక వైకాపా ఎమ్మెల్యేలు సూచించినట్టు సమాచారం.