: పవన్ సభకు లక్ష మంది హాజరవుతారట!... భారీ అంచనాలేస్తున్న జనసేన!
తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో నేటి సాయంత్రం జరగనున్న జనసేన సభకు లక్షకు పైగా జనం హాజరవుతారట. ఈ మేరకు ఆ పార్టీ నేతలు భారీ అంచనాలేస్తున్నారు. లక్ష మంది జనానికి సరిపడే విధంగానే నగరంలోని జేఎన్టీయూకే వర్సిటీ ప్రాంగణంలో భారీ ఏర్పాటు చేసినట్లు సమాచారం. సభ కోసం నిన్న రాత్రికే ఆ పార్టీ అధినేత, టాలీవుడ్ అగ్ర నటుడు పవన్ కల్యాణ్ కాకినాడ చేరుకోగా... ఆయన అభిమానులు కూడా ఆయన బాటలోనే నిన్నటి నుంచే కాకినాడకు చేరుకుంటున్నారు. ఇప్పటికే కాకినాడ నగరం పవన్ అభిమానులు, జనసేన పార్టీ కార్యకర్తలతో నిండిపోయినట్లు సమాచారం. ఇదిలా ఉంటే ‘సీమాంధ్రుల ఆత్మ గౌరవ సభ’ పేరిట పవన్ కల్యాణ్ ఏర్పాటు చేస్తున్న ఈ సభకు వామపక్ష పార్టీలు సీపీఐ, సీపీఎం మద్దతు ప్రకటించాయి.