: కాకినాడలో అమల్లోకి వచ్చిన ట్రాఫిక్ ఆంక్షలు!... పవన్ కల్యాణ్ బస చేసిన హోటల్ వద్ద భారీ జన సందోహం!
‘సీమాంధ్రుల ఆత్మగౌరవ సభ’ పేరిట భారీ బహిరంగ సభకు టాలీవుడ్ అగ్ర నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్... తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో భారీ ఏర్పాట్లే చేశారు. ఈ సభ కోసం నిన్న రాత్రికే ఆయన కాకినాడ చేరుకున్నారు. నగరంలోని ఓ ప్రైవేటు హోటల్ లో ఆయన బస చేశారు. ఇక నేటి మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కానున్న ఈ సభ నేపథ్యంలో అప్పుడే నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి వచ్చేశాయి. నిన్న సాయంత్రం నుంచి రాష్ట్రంలోని నలుమూలల నుంచి పవన్ కల్యాణ్ అభిమానులు పెద్ద సంఖ్యలో కాకినాడకు తరలివచ్చారు. నేటి ఉదయం తెల్లవారకముందే పెద్ద సంఖ్యలో అభిమానులు పవన్ కల్యాణ్ బస చేసిన హోటల్ వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలో అక్కడ భారీ జనసందోహం నెలకొంది.