: ఒబామా కంటే రష్యా అధ్యక్షుడే బెటర్!... పుతిన్ పై ట్రంప్ ప్రశంసలు!


అమెరికా అధ్యక్ష పదవికి త్వరలో జరగనున్న ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగనున్న ఆ దేశ రియల్ ఎస్టేట్ టైకూన్ డొనాల్డ్ ట్రంప్ తన వివాదాస్పద వ్యాఖ్యలను కొనసాగిస్తున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పై పెంటగాన్ చీఫ్ విమర్శలు గుప్పించిన మరుక్షణమే రంగంలోకి దిగిన ట్రంప్ తన దేశ సైనికాధికారి ప్రకటనకు భిన్నంగా స్పందించారు. అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు బరాక్ ఒబామా కంటే కూడా రష్యా అధ్యక్షుడే బెటరని ఆయన వ్యాఖ్యానించారు. అమెరికాపై ఒబామాకు ఉన్న పట్టు కంటే రష్యాపై ఆ దేశ అధ్యక్షుడిగా పుతిన్ కు మంచి పట్టు ఉందని ట్రంప్ అన్నారు. ఒకవేళ తాను అమెరికా అధ్యక్ష పదవి చేపడితే పుతిన్ తోను, రష్యాతోను సత్సంబంధాలు నెరపుతానని ఆయన ప్రకటించారు. ఒబామాలా కాకుండా తాను చాలా దేశాల అధినేతలతో సత్సంబంధాలు నెలకొల్పుతానని ట్రంప్ వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News