: పవన్ కల్యాణ్ ‘సీమాంధ్ర ఆత్మ గౌరవ సభ’ నేడు!... కాకినాడకు అభిమానుల క్యూ!
టాలీవుడ్ అగ్ర నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్... ఏపీకి ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ ఏర్పాటు చేసిన ‘సీమాంధ్ర ఆత్మ గౌరవ సభ’ నేడు తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో జరగనుంది. నగరంలోని జేఎన్టీయూ క్యాంపస్ లో జరగనున్న ఈ బహిరంగ సభకు ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఇక సభకు హాజరయ్యేందుకు నిన్న రాత్రికే పవన్ కల్యాణ్ కాకినాడ చేరుకున్నారు. అదే సమయంలో ఈ సభకు హాజరయ్యేందుకు వేలాదిగా పవన్ కల్యాణ్ అభిమానులు కాకినాడకు తరలివస్తున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేమని తేల్చేసిన కేంద్రం... ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించిన నేపథ్యంలో పవన్ కల్యాణ్ ఏ విధంగా స్పందిస్తారన్న అంశంపై ఏపీ ప్రజలంతా ఆయన సభపై అమితాసక్తి చూపుతున్నారు.