: తెలంగాణకు ఇచ్చిన హామీలన్నీ జైట్లీ నెరవేరుస్తానన్నారు: కేటీఆర్


రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణకు ఇచ్చిన వాగ్దాలన్నింటిని నెరవేరుస్తామని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ హామీ ఇచ్చారని కేటీఆర్ అన్నారు. ఢిల్లీలో జైట్లీతో భేటీ అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ, నీతి ఆయోగ్ సిఫార్సుల మేరకు మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ ప్రాజెక్టులకు రూ.24,500 కోట్లు సాయం చేయాలని కేంద్రాన్ని కోరినట్లు చెప్పారు. బీఆర్ జీ ఎఫ్ కింద జిల్లాలకు ఇచ్చే నిధుల్లో రెండో విడత సాయం తెలంగాణకు ఇంకా అందలేదన్నారు. ఏపీకి ఇచ్చినట్లే తెలంగాణలోని వెనుకబడిన జిల్లాలకు సైతం ఆర్థిక సాయం అందించాలని కోరానన్నారు. విభజన చట్టంలో రెండు రాష్ట్రాలకు ఇస్తామన్న రాయితీలను తక్షణమే ఇవ్వాలని కోరినట్లు కేటీఆర్ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News