: ఓ అంధ మహిళా స్ప్రింటర్ కి గైడ్ గా వ్యవహరించిన జమైకా చిరుత
అంధురాలైన ఓ స్ప్రింటర్ కు జమైకా చిరుత ఉసేస్ బోల్ట్ గైడ్ గా వ్యవహరించాడు. బ్రెజిల్ లో దివ్యాంగులకు ప్రత్యేకంగా నిర్వహిస్తున్న పారా ఒలింపిక్స్ లో బోల్ట్ ఓ అంధ మహిళా అథ్లెట్ కి ట్రాక్ పై సహాయకుడిగా వ్యవహరించాడు. ప్రధాన పరుగు సమయంలో అథ్లెట్ల్ ట్రాక్ పై గైడ్ సాయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే బోల్ట్ సదరు అథ్లెట్ కు గైడ్ గా వ్యవహరించాడు. అయితే, బోల్ట్ సాయం చేసిన పరుగు ప్రచారంలో భాగంగా నిర్వహించినట్లు తెలుస్తోంది. ‘పారా ఒలింపిక్స్ లో పోటీ పడే అథ్లెట్స్ అందరికీ సెల్యూట్’ అంటూ ట్రిపుల్ హ్యాట్రిక్ వీరుడు బోల్ట్ సామాజిక మాధ్యమాల ద్వారా వారిలో స్ఫూర్తిని నింపే ప్రయత్నం చేశాడు.