: ‘కిసాన్‌ యాత్ర’లో భాగంగా రేపు అయోధ్యలో పర్యటించనున్న రాహుల్ గాంధీ


బాబ్రీమసీదు కూల్చివేసినప్పటి నుంచి (1992) ఇప్ప‌టి వ‌ర‌కు అయోధ్యలో పర్యటించని గాంధీ కుటుంబం మళ్లీ తొలిసారిగా ఆ ప్రాంతంలో కాలు పెట్టనుంది. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్రారంభించిన‌ ‘కిసాన్‌ యాత్ర’లో భాగంగా రేపు అయోధ్య‌లో ఆయన అడుగుపెట్ట‌నున్నారు. అయోధ్య ప‌ర్య‌ట‌న‌లో భాగంగా రాహుల్ అక్క‌డి హనుమాన్‌ గర్హి దేవాలయంలో పూజల్లో పాల్గొంటారు. అయితే, రామజన్మభూమి- బాబ్రి మసీదు స్థలాన్ని రాహుల్ గాంధీ సందర్శిస్తారా? అన్న అంశంపై సందిగ్ధ‌త ఏర్ప‌డింది. 1990లో భార‌త‌ మాజీ ప్రధానమంత్రి రాజీవ్‌ గాంధీ హనుమాన్‌ గర్హి దేవాలయాన్ని దర్శించుకోవాలని అనుకున్నారు. అయితే, కొన్ని కారణాల వల్ల అది సాధ్యం కాలేదు.

  • Loading...

More Telugu News