: కాకినాడ చేరుకున్న ‘జనసేన’ అధినేత పవన్ కల్యాణ్

జనసేన పార్టీ అధినేత, ప్రముఖ హీరో పవన్ కల్యాణ్ ఈరోజు రాత్రికి కాకినాడ చేరుకున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ ఆత్మగౌరవ సభ పేరుతో రేపు కాకినాడలోని జేఎన్టీయూ గ్రౌండ్ లో సభ నిర్వహిస్తున్నట్లు జనసేన పార్టీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పవన్ అక్కడికి చేరుకున్నారు. ఇక్కడి జీఆర్టీ హోటల్ లో ఆయన బస చేస్తున్నారు. ఈ ప్రాంతంలోకి మీడియాను అనుమతించట్లేదని సమాచారం.