: పంచెలూడదీసి చూడాల్సినంత ఆసక్తి ఆయకేంటో... నాకు అర్థం కాలేదు!: వెంకయ్యనాయుడు
ఏపీకి ప్రత్యేక హోదా రాకపోతే తనను ఏపీలో అడుగుపెట్టనివ్వనంటూ ఇటీవల ఒకాయన తనపై వ్యాఖ్యలు చేశారని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. మీడియా సమావేశంలో ఆయన ఈ విషయాన్ని ప్రస్తావించారు. ‘ఆ మధ్య ఒక మహానుభావుడు.. వెంకయ్యనాయుడిని ఆంధ్రప్రదేశ్ లో అడుగుపెట్టనివ్వనన్నాడు. పంచె.. పంచెలూడదీస్తాడట. పంచెలూడదీసి చూడాల్సిన ఆసక్తి ఆయనకేంటో నాకర్థం కాలేదు! ఆయనకు లేవా పంచలు, ఏంటో నాకర్థం కాలేదు! రాజకీయాల్లో ఉండి, రాజకీయ స్థాయి మరచి ఇంత అసభ్యకరమైన పదజాలం వాడారు. వ్యక్తుల గురించి మాట్లాడేటప్పుడు, వ్యాఖ్యలు చేసేటప్పుడు కొద్దిగా ఆలోచించుకుని మాట్లాడాల్సి ఉంటుంది’ అని వెంకయ్యనాయుడు ఆవేశంగా అన్నారు.