: సరబ్ జిత్ ను చికిత్స కోసం విదేశాలకు తరలించే యోచన
ఖైదీల చేతిలో దాడికి గురై కొన్ని రోజులుగా కోమాలో ఉన్న సరబ్ జిత్ ను మెరుగైన చికిత్స కోసం విదేశాలకు తరలించాలని పాక్ ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం వైద్య నిపుణులతో ఒక కమిటీని నియమించింది. ఈ కమిటీ లాహోర్ లోని జిన్నా ఆస్పత్రిలో ఉన్న సరబ్ జిత్ ఆరోగ్య పరిస్థితిని సమీక్షించి ఇచ్చే నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకుంటారు. ఇప్పటికే మెదడుకు తీవ్ర గాయాలయ్యాయని, అతడు బతకడం కష్టమని వైద్యులు ప్రకటించారు. దీంతో అతడు మరణిస్తే వచ్చే విమర్శలను తగ్గించుకునేందుకే పాక్ ప్రభుత్వం ఈ ఎత్తుగడను అనుసరిస్తోందని భావిస్తున్నారు.