: విజయవాడ, కర్నూల్, ఖమ్మంలలో ఈపీఎఫ్ వో డివిజన్ కార్యాలయాలు ఏర్పాటు చేస్తాం: బండారు దత్తాత్రేయ


విజయవాడ, కర్నూల్, ఖమ్మంలలో ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) డివిజన్ కార్యాలయాలను ఏర్పాటు చేస్తామని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ వెల్లడించారు. ఈరోజు ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ఈ నెల 17న విశ్వకర్మ జయంతిని కేంద్ర కార్మికశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తామన్నారు. కార్మికులకు కనీస వేతనం రూ.10,500 ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. మహిళలకు ప్రసూతి సెలవులు 12 నుంచి 26 వారాలకు పెంచామని, కార్మికులకు ఇచ్చే బోనస్ రూ.3500 నుంచి రూ.7 వేలకు పెంచామని అన్నారు. ఉద్యోగం కోల్పోయిన వారికి రాజీవ్ గాంధీ శ్రామిక కల్యాణ్ యోజన కింద నిరుద్యోగ భృతి కల్పించనున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 16న ఢిల్లీలో ఉత్తమ పారిశ్రామికవేత్తలకు అవార్డులు ప్రదానోత్సవం చేయనున్నట్లు దత్తాత్రేయ తెలిపారు.

  • Loading...

More Telugu News