: స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఇంతటి మహోన్నత ప్యాకేజీ ఎన్నడూ రాలేదు: బీజేపీ ఎంపీ హరిబాబు వ్యాఖ్య


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆర్థిక బలం పెరిగేలా అరుణ్ జైట్లీ ప్రకటించిన ప్యాకేజీ మహోన్నతమైనదని విశాఖ ఎంపీ, బీజేపీ నేత హరిబాబు వ్యాఖ్యానించారు. ఈ మధ్యాహ్నం ఓ టీవీ చానల్ తో మాట్లాడిన ఆయన, దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఈ తరహా ప్యాకేజీ ఎన్నడూ రాలేదని చెప్పుకొచ్చిన ఆయన, విజయవాడకు ఎట్టి పరిస్థితుల్లోనూ రైల్వే జోన్ రాదని, విశాఖకే వస్తుందని అన్నారు. విజయవాడకు జోన్ రానుందని నిన్న జరిగిన ప్రచారం పూర్తి అవాస్తవమని, అసలా ఉద్దేశమే కేంద్రానికి లేదని తెలిపారు. ఛారిత్రాత్మకమైన ప్యాకేజీని ఏపీకి ప్రకటించిన ఆర్థిక మంత్రి జైట్లీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్యాకేజీలో భాగంగా వచ్చే నిధులతో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళుతుందని హరిబాబు అన్నారు.

  • Loading...

More Telugu News