: హోదాపై ప్ర‌క‌ట‌న చేస్తానన్నా వినిపించుకోని వైసీపీ.. శాస‌న‌స‌భ రేప‌టికి వాయిదా


వాయిదా అనంతరం ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు తిరిగి ప్రారంభమైన శాస‌న‌స‌భలో వైఎస్సార్ సీపీ నేత‌లు తీవ్ర స్థాయిలో ప్ర‌త్యేక హోదా కోసం నినాదాలు చేశారు. పరిస్థితిలో ఎలాంటి మార్పు రాక‌పోవ‌డంతో ప్రారంభ‌మైన శాస‌న‌స‌భ మ‌ళ్లీ వాయిదా ప‌డాల్సి వ‌చ్చింది. వైసీపీ నేత‌లు స్పీక‌ర్ పోడియాన్ని చుట్టుముట్ట‌డంతో స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద్‌రావు శాస‌న‌స‌భ‌ను రేప‌టికి వాయిదా వేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. వైసీపీ సభ్యుల తీరు ప‌ట్ల‌ ముఖ్యమంత్రితో పాటు బీజేపీ నేత విష్ణుకుమార్‌రాజు తీవ్రంగా ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కి ప్రత్యేక హోదాపై ప్రకటన చేసేందుకు ముఖ్యమంత్రి చంద్ర‌బాబు సిద్ధమేనని చెప్పినప్పటికీ వైసీపీ నేత‌లు పట్టించుకోలేదు. దీంతో సభ వాయిదా ప‌డింది.

  • Loading...

More Telugu News