: నో ఛాన్స్.. ‘హోదా’ విషయంలో వెనకడుగు వేయబోం: ఏపీ ఆర్థికమంత్రి యనమల


ప్ర‌త్యేక హోదా కోసం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ అసెంబ్లీలో ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ సీపీ నేత‌లు నినాదాలు చేస్తోన్న నేప‌థ్యంలో రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు స్పందించారు. అసెంబ్లీ వాయిదా పడిన అనంత‌రం శాసనసభ లాబీలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రానికి హోదా సాధించుకునే క్ర‌మంలో వెన‌క‌డుగు వేయ‌కూడ‌ద‌ని తాము భావిస్తున్నట్లు ఆయ‌న పేర్కొన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకోవ‌డ‌మే ల‌క్ష్యంగా హోదాపై సాధించుకోవ‌డానికి ముందుకు వెళ‌తామ‌ని ఆయ‌న తెలిపారు. నిన్న కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ చేసిన‌ ప్రకటన ద్వారా పోలవరానికి ఎంతో లాభం క‌లిగింద‌ని యనమల అన్నారు. ఆ ప్రాజెక్టుకు అయ్యే ఖర్చునంతా కేంద్ర‌మే ఇస్తుంద‌ని చెప్పార‌ని ఆయ‌న గుర్తుచేశారు. పోల‌వ‌రం కోసం కేంద్రం మొద‌ట 70 శాతం ఖ‌ర్చును భ‌రిస్తామ‌ని చెప్పింద‌ని మిగ‌తా ఖ‌ర్చు రాష్ట్ర‌మే భ‌రించాల‌ని చెప్పింద‌ని ఆయ‌న అన్నారు. తాము 10 శాతం మాత్రమే భరించగలమని ఆనాడు కేంద్రానికి తెలిపిన‌ట్లు చెప్పారు. విదేశీరుణ ప్రాజెక్టుల విష‌యంలో కూడా మంచి ప్ర‌క‌టన వ‌చ్చిందని యనమల పేర్కొన్నారు. జైట్లీ ప్ర‌క‌ట‌న‌తో రాష్ట్రం తీసుకునే విదేశీ రుణంలో 90 శాతం కేంద్రమే భరిస్తుందని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News