: చంద్రబాబు రాజీనామా చేయాల్సిందే!: జగన్
రాష్ట్ర ప్రజల సెంటిమెంట్ ను నిలబెట్టి ప్రత్యేక హోదా తీసుకురావడంలో విఫలమైన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన పదవికి రాజీనామా చేయాల్సిందేనని వైకాపా అధినేత వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని యువత భవిష్యత్తు నిమిత్తం పోరాటం తప్ప మరో మార్గం తన కళ్ల ముందు కనిపించడం లేదని ఆయన అన్నారు. చంద్రబాబు రాజీనామా చేస్తే మాత్రమే ప్రజల్లో కొంతైనా విశ్వసనీయతను నిలుపుకున్న వారవుతారని, లేకుంటే తీవ్ర ప్రజా వ్యతిరేకతలో కొట్టుకుపోతారని హెచ్చరించారు. జైట్లీ ప్రకటనను స్వాగతిస్తున్నట్టు చెప్పడం చంద్రబాబు తప్పని, అసలా ప్రకటనకు ఎలా అంగీకరిస్తారని ప్రశ్నించిన జగన్, రాష్ట్ర భవిష్యత్తును ఖూనీ చేస్తున్నారని నిప్పులు చెరిగారు. ఎల్లుండి తలపెట్టిన బంద్ కు ప్రతి ఒక్కరూ మద్దతు తెలిపి హోదా విషయంలో రాష్ట్రం ఏకతాటిపై ఉందన్న సంకేతాలను గట్టిగా తెలియజేయాలని పిలుపునిచ్చారు.