: రూ.900కే ఇండిగో టికెట్


బడ్జెట్ విమానయాన సంస్థ ఇండిగో కూడా చౌక ధరల యుద్ధంలోకి దిగిపోయింది. కేవలం 900 రూపాయలకే విమాన ప్రయాణ ఆఫర్ ప్రకటించింది. జమ్మూ-శ్రీనగర్, ఢిల్లీ-జైపూర్ రూట్లలో ఈ ధరకు టికెట్లను అందుబాటులో ఉంచింది. ఇక ఇతర రూట్లకు సంబంధించి 1346 రూపాయల నుంచి 1896 రూపాయల మధ్య ధరలను నిర్ణయించింది. తగ్గింపు ధరలకు టికెట్ల బుకింగ్ ఈ నెల 10వరకు అమల్లో ఉంటుందని కంపెనీ ప్రకటించింది. ఈ నెల 13 నుంచి 30 మధ్య ప్రయాణించాలని కోరుకునే వారు ఈ నెల 10లోపు బుక్ చేసుకుంటేనే ఆఫర్ కింద తక్కువ ధరలకే టికెట్లు సొంతం చేసుకోవడానికి వీలుంటుంది. ఎయిర్ ఆసియా, విస్తారా ఎయిర్ లైన్స్ ఇటీవలే పలు రూట్లలో 549 నుంచి 949 రూపాయలకే ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తూ ఆఫర్లు ప్రకటించడంతో ఇండిగో కూడా ధరలను తగ్గించినట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News