: భాగ్యనగరివైపు ఆటోమొబైల్ కంపెనీల చూపు: కేటీఆర్


ఆటోమొబైల్, ఇంజనీరింగ్ కంపెనీలు హైదరాబాద్ వైపు చూస్తున్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు. గచ్చిబౌలిలోని హయత్ హోటల్లో ఈ రోజు జరిగిన ఓ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లో టెక్నికల్ సెంటర్ ఏర్పాటుకు ముందుకు వచ్చిన జెడ్ ఎఫ్ గ్రూపుతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ సాఫ్ట్ వేర్ తో సమానంగా హార్డ్ వేర్, ఆటోమొబైల్, ఇంజనీరింగ్ రంగాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయన్నారు. జెడ్ఎఫ్ గ్రూపు ఏర్పాటు చేయబోయే కేంద్రంలో రానున్న నాలుగేళ్లలో 2,500 మందికి ఉపాధి కలుగనుండడం సంతోషకరమన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు ముందుకువచ్చే వారికి అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు.

  • Loading...

More Telugu News