: అధ్యక్షా... వారిని సస్పెండ్ చేయకుంటే మేమూ వెల్ లోకి వస్తాం: బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు


ప్రత్యేక హోదాపై చర్చించాలంటూ ప్రతిపక్ష వైసీపీ సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు చేరి నిరసనకు దిగడంతో ఏపీ శాసనసభలో ప్రతిష్టంభన నెలకొంది. స్పీకర్ ను వైసీపీ సభ్యులు చుట్టుముట్టి నినాదాలకు దిగారు. కాగా, వైసీపీ సభ్యుల తీరును టీడీపీ, బీజేపీ పక్షాలు తీవ్రంగా తప్పుబట్టాయి. బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ ఇలాంటి ప్రతిపక్షాన్ని చూడాల్సి రావడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ‘అధ్యక్షా! మీరు వారిని సస్పెండ్ చేయాలి. లేకుంటే మేము కూడా వెల్ లోకి రావాల్సిన పరిస్థితి వస్తుంది’ అంటూ ఆయన వ్యాఖ్యానించారు. సభా మర్యాదలను గౌరవించాలని మంత్రి యనమల సహా పలువురు వైసీపీ సభ్యులకు సూచించారు.

  • Loading...

More Telugu News