: పాక్ కు వ్యతిరేకం కాదు... హఫీజ్ సయీద్ ఆరోపణలపై స్పందించిన అమెరికా


మిలటరీ బేస్ లను పంచుకోవాలని ఇండియా, అమెరికా కుదుర్చుకున్న ఒప్పందం పాకిస్థాన్ కు వ్యతిరేమని; చైనా, పాకిస్థాన్ మధ్య ఉన్న ఎకనామిక్ కారిడార్ ను దెబ్బతీసేందుకే అమెరికా నిర్ణయించుకుందని జమాత్ - ఉద్ - దవా చీఫ్ హఫీజ్ సయీద్ చేసిన వ్యాఖ్యలను అమెరికా ఖండించింది. "పాకిస్థాన్ తో మాకు మంచి ద్వైపాక్షిక సంబంధాలున్నాయి. ఇండియాతో డీల్ పాక్ కు వ్యతిరేకం కాదు. అయితే, పాక్ హామీ ఇచ్చినట్టుగా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడాలి. పొరుగు దేశాల్లో అశాంతికి కారణమవుతున్న ఉగ్ర సంస్థలను తుదముట్టించాలి" అని అమెరికా ప్రతినిధి మార్క్ టోనర్ వ్యాఖ్యానించారు. పాక్ గడ్డపై ఉండి ఇతర దేశాల్లో మారణహోమానికి కారణమవుతున్న ఈ తరహా సంస్థలను రూపుమాపాల్సిందేనని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News