: పవన్ ఆంధ్రుల ఆత్మగౌరవ సభ రేపే.. కాకినాడలో ఏర్పాట్లు షురూ
ప్రత్యేక హోదా సాధన ఉద్యమంలో భాగంగా సినీ హీరో, జనసేన అధినేత పవన్ కల్యాణ్ శుక్రవారం తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో ఆంధ్రుల ఆత్మగౌరవ సభ నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి స్థానిక జేఎన్టీయూ క్రీడా మైదానంలో ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. జనసేన కార్యకర్తలు, పవన్ అభిమానులు స్వయంగా ఈ ఏర్పాట్లలో పాల్గొంటున్నారు. ఈ సభ వేదికగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఆవశ్యకమంటూ పవన్ మరోసారి నినదించనున్నారు. సభ నేపథ్యంలో పవన్ అభిమానులు నగరంలో గురువారం కూడా పాదయాత్రలు నిర్వహించారు. పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు సైతం విధించారు. ఈ సభకు పోలీసు శాఖ ఇప్పటికే అనుమతి జారీ చేసింది.