: 10న వామపక్షాల బంద్ కు మరింత మద్దతు!... రాష్ట్ర బంద్ కు వైసీపీ కూడా పిలుపు!
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేమన్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటన ఏపీలో అగ్గిని రాజేసింది. ప్రత్యేక ప్యాకేజీ పాట పాడిన కేంద్రం వైఖరిని నిరసిస్తూ ఈ నెల 10న రాష్ట్ర బంద్ కు పిలుపునిస్తూ వామపక్షాలు సీపీఐ, సీపీఎం ప్రకటించాయి. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ కూడా అదే రోజున జాతీయ రహదారుల దిగ్బంధనానికి పిలుపునిచ్చారు. తాజాగా ఈ మూడు పార్టీలకు మద్దతుగా వైసీపీ కూడా 10న రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చింది. వెరసి ఏపీలోని అన్ని విపక్షాలు కూడా బంద్ కు పిలుపునిచ్చినట్లైంది.