: హైదరాబాద్ అసెంబ్లీలో ఇవే చివరి ఏపీ సమావేశాలు: చీఫ్ విప్ కాల్వ
హైదరాబాద్ లోని అసెంబ్లీలో ప్రస్తుతం జరుగుతున్న సమావేశాలే చివరివని, తదుపరి సమావేశాలు అమరావతిలోనే జరుగుతాయని ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు వ్యాఖ్యానించారు. మూడు రోజుల పాటు ప్రస్తుతం సమావేశాలు సాగనున్నాయని, రోజుకు 10 గంటల పాటు సభను జరుపుకుందామని ఆయన సూచించారు. సభకు విపక్షం సహకరించాలని కోరిన ఆయన, మూడు రోజుల్లో 30 గంటలు పనిచేసి ప్రజా సమస్యలపై చర్చిద్దామని అన్నారు. గతంలో జరిగిన ఏ సమావేశాల్లోనూ వైసీపీ సమస్యలపై చర్చకు ముందుకు రాలేదని, విలువైన సమయం వృథా చేయడమే వారి కర్తవ్యమని ఎద్దేవా చేశారు.