: మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత మాణిక్ రావు ఇకలేరు
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి, రంగారెడ్డి జిల్లా తాండూరు నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న ఎం.మాణిక్ రావు నేటి తెల్లవారుఝామున మృతిచెందారు. ఆయన వయసు 86 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన్ను నిమ్స్ ఆసుపత్రిలో చేర్పించగా, చికిత్స పొందుతూ మరణించారు. 14 సంవత్సరాల పాటు వివిధ శాఖల్లో మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన ఆయన, ఓ దఫా ఎమ్మెల్సీగానూ ఎన్నికయ్యారు. మాణిక్ రావు మృతిపట్ల పలువురు రాజకీయ నేతలు సంతాపం వెలిబుచ్చారు.