: బీఏసీని బాయ్ కాట్ చేసిన వైసీపీ!
ఏపీ అసెంబ్లీలో విపక్ష హోదాలోని వైసీపీ నేటి ఉదయం కీలక నిర్ణయం తీసుకుంది. శాసనసభ సమావేశాలు ప్రారంభం కాకముందే జరిగిన సభా వ్యవహారాల కమిటి (బీఏసీ) సమావేశం స్పీకర్ కోడెల అధ్యక్షతన జరిగింది. ఈ భేటీకి వైసీపీ నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గడికోట శ్రీకాంత్ రెడ్డి హాజరయ్యారు. మూడు రోజుల పాటు సమావేశాలను నిర్వహించనున్నట్లు అధికార టీడీపీ ప్రకటించగా... అందుకు వైసీపీ ససేమిరా అంది. కనీసం 15 రోజుల పాటు సమావేశాలను నిర్వహించాలని డిమాండ్ చేసింది. అందుకు టీడీపీ ఒప్పుకోకపోవడంతో బీఏసీ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు పెద్దిరెడ్డి ప్రకటించారు. ఆ వెంటనే శ్రీకాంత్ రెడ్డితో కలిసి ఆయన లేచి విసవిసా బయటకొచ్చేశారు.