: 10న ఏపీ బంద్... జాతీయ రహదారుల దిగ్బంధానికి కాంగ్రెస్ పిలుపు
రాష్ట్రానికి ప్రత్యేక హోదాను తక్షణం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, 10వ తేదీ శనివారం నాడు జాతీయ రహదారులను దిగ్బంధించాలని ఆంధ్రప్రదేశ్ పీసీసీ పిలుపునిచ్చింది. కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడిన ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, బంద్ కు అన్ని రాజకీయ పార్టీలూ మద్దతు పలకాలని కోరారు. కేంద్రం తీరుపై అన్ని రాజకీయ పార్టీలూ నిరసన తెలియజేయాలని కోరిన ఆయన, రాష్ట్ర ప్రజల సెంటిమెంట్ ను అర్థం చేసుకోవడంలో కేంద్రం విఫలమైందని విమర్శించారు. కాగా, ఈ నిరసన కార్యక్రమానికి సీపీఐ, సీపీఎం మద్దతు పలికాయి.