: తీరు మారని ఏపీ అసెంబ్లీ!... విపక్షం ఆందోళనతో సభలో గందరగోళం!
ఏపీ అసెంబ్లీ సమావేశాల తీరేమీ మారలేదు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కొలువు దీరిన సభలో టీడీపీ అధికారం చేపట్టగా, వైసీపీ విపక్ష స్థానానికి పరిమితమైంది. ఈ క్రమంలో ఇఫ్పటిదాకా జరిగిన అన్ని శాసనసభ సమావేశాల్లోనూ వైసీపీ నిరసన, అందుకు ప్రతిగా అధికారపక్షం కౌంటర్లతో సభలో ఎప్పటికప్పుడు గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. పలు సందర్భాల్లో ఇరు పార్టీలకు చెందిన నేతల మధ్య మాటల తూటాలు పేలాయి. లెక్క లేనన్ని సార్లు సభ వాయిదా పడింది. ఈ క్రమంలో నేటి ఉదయం ప్రారంభమైన సభలోనూ అదే తరహా వాతావరణం నెలకొంది. ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ వైసీపీ నిరసన, అందుకు ప్రతిగా అధికార పక్షం ఎదురుదాడితో సభలో వేడి రాజుకుంది.