: యూపీ సీఎం స్మార్ట్‌ఫోన్ల ఆఫర్.. ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేసిన బీజేపీ


ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రకటించిన స్మార్ట్‌ఫోన్ల ఆఫర్‌పై గురువారం బీజేపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ప్రభుత్వ ప్రకటన ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కిందకు వస్తుందని ఆరోపించింది. రాష్ట్రంలో ఎన్నికలు జరగడానికి ముందు ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ స్మార్ట్‌ఫోన్ల ఆఫర్ ప్రకటించడం ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కిందకు వస్తుందని బీజేపీ ఎంపీ రాజేంద్ర అగర్వాల్ ఎన్నికల సంఘానికి రాసిన లేఖలో ఫిర్యాదు చేశారు. ఓటర్లను ఆకర్షించేందుకే ఆయన ఈ ఆఫర్‌ను ప్రకటించారని ఆరోపించారు. ఎన్నికల్లో ఎలాగైనా గెలపొందాలనే ఉద్దేశంతోనే ఆయన ఈ పథకాన్ని ప్రకటించారని అన్నారు. అందులో భాగంగానే ఫోన్ల కోసం ఇప్పుడు రిజిస్టర్ చేసుకుంటే 2017 అర్ధభాగం తర్వాత ఫోన్లు అందిస్తామని పేర్కొన్నారని తెలిపారు. ఇది పూర్తిగా ప్రవర్తనా నియమావళి కిందకు వస్తుందని, అఖిలేష్ ప్రభుత్వంపై చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు.

  • Loading...

More Telugu News